పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా
NEWS Feb 02,2025 09:33 am
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ కేంద్రంగా ప్రారంభించినా, 2025-26 కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్థ్రాలు సంధించారు. టీ బోర్డుకు రూ.771 కోట్లు, కాఫీ బోర్డుకు రూ.280 కోట్లు, రబ్బరు బోర్డుకు రూ.360కోట్లు, స్పైసెస్ బోర్డుకు రూ.153 కోట్లు కేటాయించి, కొత్తగా ప్రారంభించిన పసుపు బోర్డుకు రిక్త హస్తం చూపించారని మండి పడ్డారు. పసుపు బోర్డుకి నిధులు ఇవ్వలేదన్నారు.