దశాబ్దాలుగా జాతీయ పసుపు బోర్డు పేరిట సాగిన రాజకీయ రగడ కేంద్రం బోర్డు ఏర్పాటుతో తెర పడిందనుకుంటే, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కేంద్రంగా మళ్లీ రాజకీయ రగడ ఆరంభమైంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు నయా పైసా నిధులు కూడా కేటాయించ లేదు.దేశంలోని అన్ని బోర్డులకు కేంద్ర బడ్జెట్ లో నిధులిచ్చి పసుపు బోర్డుకు మాత్రం గుండు సున్నా చూపించారని కవిత విమర్శించారు .