సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈనెల 5వ తేదీన ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతుండడం విశేషం. ఇదే సమయంలో ఆప్ వర్సెస్ బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేజ్రీవాల్. తెలంగాణ మోడల్ ను ఢిల్లీలో గెలిపిస్తే అముల చేస్తామన్నారు సీఎం.