ఏపీలో 18,036 మంది పెన్షన్ల తొలగింపు
NEWS Feb 02,2025 04:43 am
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 వేల 36 మంది పెన్షన్లను తొలగించింది. దివ్యాంగ కేటగిరీ కింద పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను గుర్తించడం జరిగిందని తెలిపింది. గత జనవరి నెలలో 63,77,943 మంది దివ్యాంగ పెన్షన్లు అందుకోగా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ సంఖ్య 63 , 59, 907కు తగ్గింది. జాబితా నుంచి తొలగించిన వారు ఇక నుంచి పెన్షన్లు పొందేందుకు అర్హులు కారు. కాగా అనర్హులు ఏయే జిల్లాల్లో ఉన్నారనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది సర్కార్.