పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి తెయూ విద్యార్థి సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ యూనివర్శిటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణలో విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సాగర్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన నరేందర్‌రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి భారీ మెజార్టీతో పంపించాలని పిలుపునిచ్చారు. గిరిజన శక్తి, ఎంఎస్‌ఎఫ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.