కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. 21 మంది ఎంపీల మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న మోదీ సర్కార్ ఏపీ రాష్ట్రంపై వివక్ష చూపడం దారుణమన్నారు. కేంద్రం నుండి రావాల్సిన వాటాను సీఎం నారా చంద్రబాబు నాయుడు విఫలం చెందాడని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రాయితీలను ఎందుకు పొందలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్ కు ప్రయోజనం చేకూర్చేలా అత్యధికంగా నిధులు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు.