ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహారీలకు మేలు చేకూర్చేలా ప్రయారిటీ ఇచ్చారని, ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఏపీ రాష్ట్రానికి రిక్తహస్తం చూపించారంటూ ధ్వజమెత్తారు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడిన చందంగా బడ్జెట్ ఉందంటూ మండిపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు కలిగిన నితీశ్ కుమార్ బడ్జెట్ లో అగ్ర తాంబూలం అందుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.