హైదరాబాద్ లోని ప్రిజం పబ్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులను చూసిన వెంటనే ప్రభాకర్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 100కి పైగా చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తన స్వస్థలం చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం.