కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఉత్తరాది బడ్జెట్ లాగా ఉందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసి ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ కు పైసా ఇవ్వలేదన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ ఏర్పాటు చేయలేదన్నారు. బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు