ఫ్లెక్సీల తొలగింపు సరికాదు
NEWS Feb 01,2025 04:44 pm
ప్రముఖ సామాజిక సేవాపరుడు, ఎన్నారై ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం సరికాదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే, ఎన్నికల కోడ్ పేరిట తొలగించమేంటని ప్రశ్నించారు. సమావేశంలో శీలా సాగర్, వేణుగోపాల్ , రవి,పిట్ల సింహం రాజేందర్ ,భాస్కర్ మహేష్, పాల్గొన్నారు.