దేశ గతిని మార్చే బడ్జెట్
NEWS Feb 01,2025 11:15 am
దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్ అంటూ కొనియాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా చేయడం సంచలన నిర్ణయమని, గతంలో ఏ సర్కార్ ఇలాంటి సాహసం చేయలేదన్నారు. తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవుతుందన్నారు. 50 లక్షల మందికి పైగా రైతులకు రూ. 5 లక్షల దాకా రుణం పొందే అవకాశం దక్కుతుందన్నారు.