జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాకీర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన నేపథ్యంలో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు రాజకీయ రంగంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పార్టీ పదవులలో వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు.