పద్మశాలీల కులదైవం మార్కండేయ జయంతి ఉత్సవాలను ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామంలోని పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు చాట్ల గణేశ్, సంఘం అధ్యక్షుడు జక్కని నాగేందర్లు మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. పద్మశాలీల కులదైవమైన మార్కండేయ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.