మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఇటీవల ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్ గుంటుక సదాశివ్, జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరి బాబు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సీఐకు అభినందనలు తెలిపారు. మెడల్ రావడం సంతోషంగా ఉందని, దీని వెనక కఠోర శ్రమ ఉందని, నిజాయితీగా సేవలందించడం ద్వారానే ఇది సాధ్యమైందని సీఐ అన్నారు.