కథలాపూర్ మండలం భూషణ్‌రావుపేట గ్రామంలో వెలుగురి భాస్కర్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, 12 సెల్ ఫోన్లను దొంగలు అపహరించినట్లు బాధితుడు భాస్కర్ పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.