కపిలేశ్వపురం మండలం అంగర గ్రామంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో పెన్షన్ తీసుకోవడానికి ఎండగంటి గ్రామానికి వెళ్తుండగా వాడపల్లి భద్రం అనే వృద్దురాలు అంగర గాంధీ సెంటర్లో బస్సు ఎక్కుతుండగా కాలు జరిపడి బస్సు క్రింద పడిపోయింది. ఈ ఘటన లో బస్సు వెనకాల చక్రాల కింద పడి అక్కడికక్కడే ఆమె మృతి చెందిందని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అంగర పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.