కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. దేశంలోని మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ఒక సంవత్సరంలో 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదని ప్రకటించారు. వార్షిక ఆదాయానికి ఇది వర్తిస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో చేసిన కేంద్ర మంత్రి ప్రకటన కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సభ్యులంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ఆహార శుద్ధికరణకు సంబంధించి పూర్వోదయ కార్యక్రమం తీసుకువస్తామన్నారు.