దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు తీపి కబురు చెప్పారు. కొత్త హంగులు చేరుస్తామన్నారు. మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవన విధానం పెంపొందిస్తామన్నారు. సుస్థిరమైన జీవన విధానం కోసం పీఎం స్వయం నిధి తీసుకువచ్చామని ప్రకటించారు. దీని ద్వారా లక్షలాది మందికి లబ్ది చేకూరుతుందన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తామన్నారు. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. ఇందులో ఏఐని ఉపయోగిస్తామన్నారు.