రైతులకు తీపి కబురు చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. స్వల్ప కాల వ్యవధిలో రుణాలు అందజేస్తామని, వీటిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ థింకరింగ్ లాబ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పాట్నాలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయిలో నాణ్యమైన బొమ్మల తయారీ హబ్ గా మారుస్తామని చెప్పారు. దేశాన్ని బుద్ద పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తామన్నారు. మెడికల్ టూరిజం చేస్తామన్నారు.