భారత దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారు. కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వాక్యాలను ఉటంకించారు ఈ సందర్బంగా. రైతులు, మహిళల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాల తో కలిపి ధన్ ధన్య కృషి యోజన పథకాన్ని తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. యువత, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ను ప్రవేశ పెట్టామని చెప్పారు నిర్మలా.