కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి సంస్థకు సీఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పాలమూరు జిల్లాకు చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎన్ .బలరాం పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది డీఓపీటీ. డిప్యూటేషన్ కాల పరిమితి మూడు ఏళ్లు మాత్రమే. కానీ తన నిజాయితీ, నిబద్దతను గమనించిన కేంద్రం ఐదేళ్లకు పొడిగించడం విశేషం. సింగరేణి సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉంటూనే సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బలరాం.