ఏపీ డీజీపీగా విశిష్ట సేవలు అందించిన ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా తనకు ఘనంగా వీడ్కోలు పలికిన తోటి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో పోలీస్ యూనిఫాంకు ఎనలేని గౌరవం ఉంటుందన్నారు. ఇవాళ దానిని వదిలి వేయాలంటే బాధగా ఉందన్నారు. తనకు శిక్షణ ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తూ వచ్చిన భార్యకు కృతజ్ఞతలు తెలిపారు.