సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గద్దర్ ను వాడుకుని వదిలేసింది కాంగ్రెస్ పార్టీనేనని, అది తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. పద్మ అవార్డు ఇవ్వక పోతే దానికి అనేక కారణాలు ఉంటాయని పనిగట్టుకుని తమ మీద నిందలు మోపితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం ప్రతీకార చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ ను జీవితాంతం అవమానించింది మీ పార్టీనేనని సంచలన ఆరోపణలు చేశారు.