కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నట్లు ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. కనీవిని ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో టీడీపీ ఏకంగా కోటి మంది సభ్యత్వాలను పూర్తి చేయడం జరిగందన్నారు. ఇదే స్పూర్తి భవిష్యత్తులో కొనసాగించాలన్నారు.