ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. నిరుద్యోగులకు శుభ వార్త చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 వేల 347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.