తెలంగాణ సాంస్కృతిక శిఖరం ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన లేక పోతే రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. తొలి దశ ఉద్యమంలోనూ..మలి దశ పోరాటంలోనూ కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ప్రపంచంలో ఏ గాయకుడు కూడా తూటాలు శరీరంలో పెట్టుకుని ఆడ లేదని, పాటలు పాడలేదని ప్రశంసించారు. గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.