ఢిల్లీ-వజీరాబాద్ రోడ్డులోని భోపురా చౌక్ వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న ట్రక్కులో సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. జనం భయభ్రాంతులకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. ఘటన జరగడంతో రహదారికి ఇరు వైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.