జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మైనార్టీ కళాశాలలో మధ్యాహ్నం సరిగా ఉడకని అన్నం తినడం వల్ల ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, విషయం తెలుసుకున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హుటాహుటిన ధర్మపురిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.