బౌద్ధ మహాసభ కోసం బౌద్ధభిక్షుల ప్రచారం
NEWS Jan 31,2025 05:02 pm
మెట్‌పల్లిలో ఫిబ్రవరి 2న నిర్వహించే బౌద్ధ మహసభకు రావాలని కోరుతూ బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన బౌద్ధ గురువులు బంతే సత్య బోధి, బుద్ధ రతన్ శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో కుల సంఘాలను, మహిళలను, యువకులను కలుస్తూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో దయ్య రఘు, గోరుమంతుల సురేందర్, సోమిడి మహేందర్ రాకేష్ పెద్దలు నరసయ్య సత్యనారాయణ వినోద్ గంగాధర్ తదితరులున్నారు.