భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
NEWS Jan 31,2025 04:53 pm
మెట్‌పల్లి పట్టణ పరిధిలోని పోచమ్మ దేవాలయాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సుఖీభవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మోహను వినతిపత్రం సమర్పించారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా ఆలయ పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగునీరు సౌకర్యం కల్పించాలని కోరారు. ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు నాగరాజు, గట్టయ్య, స్వామి, శ్రీనివాస్ ఉన్నారు.