కేసులకు భయపడం..కూటమిని నిలదీస్తాం
NEWS Jan 31,2025 02:17 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్నారు. మీ పిచ్చి మీరే భరించు కోవాలని, ఇంకొకరిపై రుద్దాలని ప్రయత్నం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక నుంచి ఎంతో ఓర్పుతో సహిస్తూ వచ్చామని, కానీ ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు . తప్పు చేస్తే ఎవరినైనా నిలదీస్తామని, కడిగా పారేస్తామన్నారు. కేసులు నమోదు చేసినా, అరెస్ట్ చేసినా, ఒత్తిళ్లకు గురి చేసినా బెదిరే ప్రసక్తి లేదన్నారు ఆర్కే రోజా.