కోటి సభ్యత్వాలను దాటేసిన టీడీపీ
NEWS Jan 31,2025 01:48 pm
తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఏకంగా కోటి మంది సభ్యత్వాలను కలిగి ఉంది. ప్రాంతీయ పార్టీలలో ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పార్టీలో చేరాలని ఇచ్చిన పిలుపునకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ, జిల్లా, నగర స్థాయి దాకా టీడీపీ సభ్యత్వాలను నమోదు చేయిస్తోంది.