కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జీల పోస్టులకు సంబంధించి వర్గీకరణ ఉండాలన్నారు. లక్షల కోట్ల బ్యాంకుల అప్పుల్లో కూడా ఎవరికి ఎంత వాటా అనేది తేల్చాలన్నారు. సీఆర్డీఏ కాంట్రాక్టుల సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. 33 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటే ఒకే సామాజిక బ్రాహ్మణ వర్గానికి చెందిన 20 మంది జడ్జీలు ఉండడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ఏపీ హైకోర్టులో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జడ్జీలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు.