గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
NEWS Jan 31,2025 01:35 pm
ప్రజా యుద్ద నౌక గద్దర్ విగ్రహాన్ని మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరారు కోరుట్ల నియోజకవర్గం ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, పట్టణ ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షుడు సమీర్ సర్కార్, శ్రీలోక్, జగదీశ్ . ఆర్డీఓ కార్యాలయంలో డీఈవోకు వినతి పత్రం సమర్పించారు. గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఆయన లేక పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదన్నారు. తన ఆట, పాటలతో సాంస్కృతిక చైతన్యం తీసుకు వచ్చారన్నారు.