తిరుమలలో రథ సప్తమికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఏడు వాహనాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని సేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిఫార్సు లేఖలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవన్నారు నాయుడు.