పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పై మండి పడింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు మీ దృష్టిలో ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే మరాఠా తరాహాలో శాసన సభ గడవు ముగిసే వరకా అంటూ సీరియస్ అయ్యింది. స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతానంటూ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.