ఫిబ్రవరి 7న MRPS తలపెట్టనున్న ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించవలసిందిగా డీజీపీని విజ్ఞప్తి చేశారు 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బైరి వెంకటేశం, SC సంక్షేమ సంఘం అధ్యక్షులు తీగల అశోక్, బహుజన ముక్తి పార్టీ నేత దేవతి శ్రీనివాస్. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా, గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదని డీజీపీని కలిసి లేఖ అందించారు.