కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన వడ్డేర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.