ఎడపల్లి మండలం జానకంపేట శివారులో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలోకి రాత్రి చిరుత వచ్చి కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. చిరుతను చూసిన హోంగార్డు అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసేలోగా అది అటవీ ప్రాంతంలోకి పారి పోయింది. ట్రైనింగ్ సెంటర్ సీఐ శివరాం జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్‌తో పాటు పది మంది అటవీ శాఖ సిబ్బంది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిసరాలను పరిశీలించి పాద ముద్రల ఆనవాళ్లను సేకరించారు. ఎఫ్‌ఆర్‌వో మాట్లాడుతూ చిరుత సంచారం నిజమేనన్నారు.