ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డి పనై పోయిందన్నారు. వైసీపీ నుంచి కీలక నేతలు తప్పు కోవడం ఖాయమన్నారు. ఆ పార్టీ ఖాళీ అవుతుందని, జగన్ రెడ్డి ఒక్కడే మిగిలి పోతాడని జోష్యం చెప్పారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలంతా తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. బుద్ది ఉన్న వాడు ఎవరూ జగన్ తో ఉండరన్నారు. విజయసాయి రెడ్డే కాదు ఇంకొందరు కూడా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారన్నారు.