పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహిపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన జీవితంలో ఎవరినీ కించ పర్చిన దాఖలాలు లేవన్నారు. పార్టీకి చెందిన కొందరు నేతలు తనపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పటాన్ చెరు ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదిక ఇస్తామని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి.