సోషల్ మీడియాలో తప్పుడు సర్వేలు జరుగుతున్నాయని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జనాలు ఎవరూ ఫాం హౌస్ పాలన కోరుకోవడం లేదని, ప్రజా పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ కావాలని తమను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అయితే తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం కొంత వీక్ ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.