ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. లేక పోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ మద్దతును ఉపసంహరించు కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టి జరగాలని చెప్పే మీరు..హోదాతోనే సంపద సృష్టి జరుగుతుందని తెలుసుకోక పోవడం మీ అవివేకానికి నిదర్శనం అంటూ సీఎంపై మండిపడ్డారు.