ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ జుకర్ బర్గ్ కు చెందిన వాట్సాప్ తో ఎంఓయూ కుదుర్చుకుంది. తొలి విడతగా రాష్ట్రంలో పౌరులకు సంబంధించిన 161 సేవలను వాట్సాప్ ద్వారా అందనున్నాయి. సీఎంను కలిసిన వారిలో మెటా ఇండియా ఉపాధ్యక్షురాలు సంధ్య దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, మెటా స్ట్రాటజిక్ ప్రొగ్రామ్స్ అండ్ పార్టనర్‌షిప్స్ చీఫ్ దివ్య కెమనీ ఉన్నారు.