పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి ఎస్పీ సింధు శర్మ
NEWS Feb 04,2025 04:24 am
కామారెడ్డి: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసులతో నెలవారి క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, పెట్రోలింగ్ పెంచి నేరాలు నియంత్రించాలని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించా రూ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు