కామారెడ్డి :ఎల్లారెడ్డి.ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్సై మహేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వాహనదారులకు పూలు అందించి అభినందనలు తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి- బాన్సువాడ రోడ్డుపై వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.