ఏ రంగంలోనైనా రాణించాలంటే ముందుగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు ఆర్కే గ్రూప్ సంస్థల సిఇఓ జైపాల్ రెడ్డి. వీర్కే జూనియర్ కాలేజీలో విద్యార్థులకు జస్ట్ ఏ మినిట్ జామ్ రౌండ్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమర్థవంతంగా ఎలా మాట్లాడాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. ప్రతి విద్యార్థి వారు ఎంచుకున్న అంశంలో ఒక్క నిమిషం పాటు తడబడకుండా మాట్లాడేలా కార్యక్రమం నిర్వహించారు. చక్కగా మాట్లాడిన విద్యార్థులను అభినందించారు.