బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గడ్డం వినోద్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. మహాత్ముడు చూపిన మార్గంలోనే నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.