జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గాంధీజీ వర్థంతి సందర్బంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, కేంద్ర మంత్రులు. గాంధీ బలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. మహాత్ముడి ప్రభావం భారత్ పైనే కాదు యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిందన్నారు.