టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆన్ లైన్ మోసాలపై తీవ్రంగా స్పందించారు. కొందరు కావాలని ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ తమను తాము గొప్పగా ఊహించు కుంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించిందన్నారు.